శ్రావణమాసం తొలి శుక్రవారం ఈ పనులు అస్సలు చెయ్యకండి..చేశారో అంతే?

-

నిన్నటి వరకూ ఆషాడ మాసం ఉంది. నేటి నుంచి శ్రావణమాసం మొదలైంది.ఈ మాసాన్ని ప్రతి ఒక్కరూ హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు..ఈ మాసంలో ప్రధానంగా అందరు లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు. అదే విధంగా..పెళ్లైన కోత్త జంటలు ఈ మాసంలో మంగళ వారం, శుక్రవారాలు గౌరీ వ్రతాలు చేస్తుంటారు. అమ్మవారిని షోడషోపచారాలతో పూజలు జరిపి, అమ్మవారిని శక్తి కొలది ధ్యానిస్తుంటారు..

చాలా మంది ఇంట్లో అనేక ఆచారాలు పాటిస్తుంటారు. కొత్తగా పెళ్లైన వారు.. సోమవారం, మట్టితో శివుడిని తయారు చేసి పూజిస్తుంటారు. అదే విధంగా.. మంగళవారం మంగళగౌరీ పూజలు, ముత్తైదువకు పసుబోట్టు, భోజన తాంబులాలు ఇవ్వడానికి ఆహ్వానిస్తుంటారు..

ఇకపోతే చాలా మంది గురువారం కూడా బాబాను పూజిస్తారు.గురువారం, శుక్రవారాలు, శనివారాలను పాటిస్తుంటారు. సాయిబాబాను అర్చిస్తుంటారు..శ్రావణ శుక్రవారాల్లో తప్పక కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడు లక్ష్మీ దేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. అంతే కాకుండా.. మన ఇంట్లో తిండికి, ధనానికి ఏమాత్రం కొదువ ఉండదు. అయితే.. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోను విడిచిన బట్టలు అసలు వేసుకొవద్దు. అదే విధంగా చిరిగిన బట్టలు, పగిలిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు ఇంట్లో నుంచి బయట పారేయాలి..

ఉదయాన్నే లేచి.. స్నానం, పూజ చేసుకొవాలి. ఉతికిన, స్వచ్ఛమైన దుస్తులను మాత్రమే ధరించాలి. అమ్మవారిని ధ్యానిస్తు ఉండాలి. ఇంట్లో ఎవరిని నిందించకూడదు. అదే విధంగా.. ఇంట్లో ఎవరు వచ్చిన, వట్టిచేతులతో వారిని వెళ్లనివ్వకూడదు. ఫలమో.. కొన్ని రూపాలయలను వారికి ఇచ్చి దండంపెట్టుకొవాలి. తమ ఇంట్లో ఆచారాన్ని బట్టి అమ్మవారిని పూజించాలి.

ఎవరి శక్తికి తగ్గట్లు వాళ్ళు అన్నవారిని పూజించాలి.. బ్రాహ్మణులు, ముత్తైదువలను ఇంటికి భోజనానికి పిలవాలి. వారు సాటిఫై అయ్యేలా భోజనం పెట్టాలి. ఆతర్వాత ఆశీర్వాదం తీసుకొవాలి. అదే విధంగా.. నిరుపేదలకు, నోరులేనిమూగ జీవాలకు తమ వంతు ఆహారాన్ని ఏదైన సహాయం చెయ్యాలి..

Read more RELATED
Recommended to you

Latest news