పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లు, నిధులపై కేంద్రం కీలక నిర్ణయం

-

పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లు, నిధులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లు, నిధులపై ఇవాళ కీలక సమావేశం అయింది. కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన పోలవరం డిజైన్ల పై సమావేశం అయ్యారు. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చ జరిగింది.

కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతో పాటు, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి సమావేశానికి హాజరు అయ్యారు. ఈనెల 11 న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యూం అహ్మద్‌ నేతృత్వంలోని అధికారుల బృందం. ఇక మరోసారి కేంద్ర బృందం ఏపీకి రానున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news