ఆ కూలీలు ఒక్కసారిగా షాక్.. ఎంత పెద్ద రక్తపింజర పామో..!!

-

సాధారణంగా మనుషులకు పాములంటే భయం ఎక్కువే. పంట పొలాల్లో, అడవుల్లో, శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో కొంచెం శబ్ధం వచ్చినా.. అక్కడేదో ఉందని భయపడిపోతుంటారు. చిన్న పామును చూసే పారిపోయే వాళ్లు ఉంటారు. అలాంటిది ఏకంగా 10 అడుగుల పాము కనిపిస్తే.. వారి భయం వర్ణనాతీతం. అలాంటి పరిస్థితే ఎదురైంది.. ఏలూరుకు చెందిన కూలీలకు..

కామవరపు కోట మండలం వాలిసుగ్రీవుల గట్టు సమీపంలోని జీడి తోటలో పది అడుగుల రక్తపింజర పాము హల్ చల్ చేసింది. జీడి తోటలో పనికి వచ్చిన కూలీలు ఆ పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గట్టిగా అరుస్తూ పరిగెత్తడం మొదలు పెట్టారు. అయితే అక్కడి స్థానికులు వచ్చి ఆ పామును హతమార్చారు.

కామవరపు కోటలో ఇంత పెద్ద పామును చూడటం ఇదే మొదటి సారి అని, ఇంత పెద్ద పామును చూసి హడలి పోయామని కూలీలు చెప్పారు. సమీప పొలంలో పని చేస్తున్న కూలీలు వచ్చి పామును హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు. కాగా, ఇటీవల మనం గమనించినట్లయితే అడవి జంతువులు జన వాసాల్లోకి వస్తున్నాయి. ఈ జంతువుల వల్ల చాలా ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news