రోశయ్య వేధించారు…చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఆర్యవైశ్యుల ద్రోహులు : మంత్రి వెల్లంపల్లి

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడులపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాక్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆర్య వైశ్యులు ద్రోహులు అని.. రోశయ్య బతికున్నప్పుడు చంద్రబాబు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆర్యవైశ్యులు పై కపట ప్రేమ చూపిస్తున్నారని… చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాచర్లలో గోపవరపు మల్లిఖార్జునరావు ను వేధించడంతో హఠాత్తుగా చనిపోయారని ఆగ్రహించారు.

చంద్రబాబు నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారని.. సొంత పార్టీలో ఉన్న శిద్దా రాఘవరావును అవమానాలకు గురి చేశారని ఫైర్‌ అయ్యారు. పొట్టి శ్రీరాములు జయంతి గా ఉన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మార్చేశారని నిప్పులు చెరిగారు. టీడీపీ సభ్యులు పదే పదే ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేస్తున్నారని.. ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరణాలకు జాతీయ గణాంకాలనే ముఖ్యమంత్రి ప్రస్తావించారని..చంద్రబాబు మెప్పు కోసం సభ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు వెల్లంపల్లి.