ఇది మరీ ఫీక్స్: సాయిరెడ్డి సాహసోపేత ఛాలెంజ్…!

-

టీడీపీ నేతల పేరు చెబితేనే ట్విట్టర్ వేదికగా ఫైరయ్యే సాయిరెడ్డి.. ఇక వారు చేస్తున్న వ్యతిరేఖ ప్రచారం మీద… కరోనా సమయంలో జగన్ చేస్తోన్న పాలనపైనా, కరోనా వ్యాప్తికి కట్టడికి చేస్తోన్న చర్యలపైనా తనదైన ఛాలెంజ్ విసిరారు! అది చదవడానికి సూచనలా అనిపించినా… అంతకుమించిన రాజకీయ పరిపాలనా ఛాలెంజ్ ఇంకొకటి ఉండకపోవచ్చనే అభిప్రాయం కలగకమానదు!

ఏపీలో కరోనా అనే అంశంపై అటు ఒక వర్గం మీడియా, మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వపై విమర్శలు చేస్తొన్న సంగతి తెలిసిందే. ఏపీలో రోజు రోజుకీ పెరుగుతున్న కేసుల సంఖ్యకు… దేశంలో ఎక్కడా లేనివిధంగా చేస్తోన్న టెస్టుల సంఖ్యే కారణం అని అధికారులు క్లారిటీ ఇచ్చినా కూడా… ప్రతిపక్షాలు టెస్టుల సంఖ్యను పక్కనపెట్టి పెరుగుతున్న కేసుల సంఖ్యను మాత్రమే ప్రస్థావిస్తూ విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విషయంపై “గూగుల్ ఛాలెంజ్” విసిరారు విజయసాయిరెడ్డి!

“ప్ర‌భుత్వం అనంతపురం జిల్లాలో 1500 ప‌డ‌క‌ల క‌రోనా ఆసుప‌త్రిని యుద్ధ ప్ర‌తిపాదిక‌న ఏర్పాటు చేసింది.. ఇంకెక్క‌డైనా ఇంత వేగంగా, స‌క‌ల సౌక‌ర్యాల‌తో తాత్కాలిక ఆస్పత్రి త‌యారైందేమో గూగుల్ ‌లో వెతికి చూడండి ప‌చ్చ త‌మ్ముళ్లూ” అంటూ సూచనతో కూడిన ఛాలెంజ్ చేశారు సాయిరెడ్డి! అనంతరం… ఈ క‌ష్ట‌కాలంలో చిరున‌వ్వుతో భ‌రోసా ఇచ్చే ముఖ్య‌మంత్రి ఉండ‌టం రాష్ట్రం అదృష్టమ‌ని కొనియాడారు.

ఇదేసమయంలో మ‌రో ట్వీట్ ట్వీటిన సాయిరెడ్డి… “బాబోయ్‌.. మీ గోబెల్స్ ప్ర‌చారం సునామీ సృష్టించే వ‌ర‌కూ వెళ్లిందా? ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఏం పాపం చేశారు? మీ కుట్ర ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతుంది. ద‌య‌చేసి టీ క‌ప్పులో సునామీ క‌థ‌నాలు మానుకోండి. ప్ర‌జ‌ల్ని హాయిగా బ‌త‌క‌నివ్వండి. కుదిరితే అన్ని ప్రాంతాల అభివృద్ధికి స‌హ‌క‌రించండ”‌ని… విశాఖ రాజధానిగా ఉండటం ఏమాత్రం ఇష్టం లేని రాజకీయ నాయకులు.. గత కొన్ని రోజులుగా చేస్తోన్న కామెంట్లపై వారికి హిత‌వు ప‌లికారు.

Read more RELATED
Recommended to you

Latest news