జైలుకు వెళ్ళే వారంతా నేరస్తులు కాదురా ఎల్లోస్ – విజయసాయి రెడ్డి

-

జైలుకు వెళ్ళే వారంతా నేరస్తులు కాదురా ఎల్లోస్ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. జైలుకు వెళ్ళే వారంతా నేరస్తులు కాదు.. అలా అయితే గాంధీజీ నుంచి చిదంబరం వరకు అందరూ నేరస్తులే అవుతారని చురకలు అంటించారు. కోర్టులో నేర నిరూపణ జరిగి శిక్ష పడితేనే నేరస్తుడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతోంది పచ్చ కుల మీడియా ? అని నిలదీశారు.

టీడీపీ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ డేటా దొంగిలించి గీతం ప్రైవేట్ యూనివర్సిటీకి చేరవేసిన గజదొంగలు ఆ యూనివర్సిటీ అడ్మిషన్స్ పూర్తయ్యాకే AUCET ఫలితాలు విడుదల చేస్తూ – గీతంకి దాసోహమయ్యారని నిప్పులు చెరిగారు సాయిరెడ్డి. టీడీపీ హయాంలో ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీకి రానన్ని UGC ప్రాజెక్ట్స్, నిధులు విశాఖలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ గీతంకు ఎలా వచ్చాయో పచ్చ కుల మీడియాకు తెలుసు. బురద జల్లడం, గుడ్డకాల్చి ముఖాన వేయడం కాదు. చేతనైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news