ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర, కోస్తాపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ, గుంటూరులో 10 మంది మృతిచెందడం బాధాకరం. అధికార యంత్రాంగంతో పాటు..
జనసేన నేతలు, కార్యకర్తలు కూడా వరద సహాయక చర్యల్లో తమ వంతు సాయపడాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.
ఇదిలాఉండగా, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ, మంగళగిరితో పాటు చాలా ప్రాంతాల్లో భారీగా వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఎప్పటికప్పుడు బాధితులు సహాయక సహకారాలు అందాలని సీఎం చంద్రబాబు సైతం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు అయితే జవజీవనంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తుఫాన్ ఎఫెక్ట్ వలన పంటలకు సంబంధించి ఎంతమేర నష్టం వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది.