ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లెక్సీ లు కడుతూ… నలుగురు మరణించడం జరిగింది. ఈ సంఘటన… తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో… ఘోర విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రు లో… సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది.
అయితే ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు… కట్టెందుకు భారీ ఏర్పాటు చేశారు. అయితే… ఈ కార్యక్రమం కు సంబంధించిన ఫ్లెక్సీలు కడుతుండగా… నలుగురు యువకులకు విద్యుత్ షాక్ వచ్చింది. దీంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నాగేంద్ర, వీర్రాజు, మణికంఠ అలాగే కృష్ణ అనే వ్యక్తులు ఉన్నారు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని… స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఉండ్రాజువరం పోలీసులు కేసు నమోదు చేసుకొని… దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు గల కారణాలపై అన్వేషణ చేస్తున్నారు.