ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల పండుగ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచీ ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. అధికశాతం ప్రవాసాంధ్రులు సాయంత్రానికే తిరుగు ప్రయాణమయ్యారు. అయితే.. ఇలాంటి తరుణంలోనే… వైసీపీ పార్టీకి 100 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ప్రకటించింది టీవీ9 ఛానెల్.
ఈ మేరకు నిన్న ఛానెల్ లో Tv9 రజనీకాంత్ మాట్లాడుతూ.. 175 కాదు కానీ, అధికార పార్టీ వైసీపీకి 100 సీట్లకి ఇంచు మించుగా గెలిచే వాతావరణం కనిపిస్తుంది, దానికి కారణం ప్రతిపక్షం అంత బలంగా పోరాడింది. నెగిటివ్ ఓట్ పెద్ద సీరియస్ గా కనిపించట్లేదు, అర్బన్ లో మాత్రం ఇది కాస్త కనిపిస్తుందన్నారు. పేదలు 100% వైసీపీ వైపు మొగ్గు చూపారు, పెత్తందారులు కూటమి వైపు ఉన్నారు. ఇది ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం మా ప్రాథమిక అంచనా వేస్తున్నాట్లు చెప్పారు. దీంతో Tv9 రజనీకాంత్ పై ట్రోలింగ్ చేస్తోంది టీడీపీ.