“వైఎస్సార్ జలకళ” యనమలకు అలా అర్ధం అయ్యింది!

-

ప్రతిపక్షాలు అంటే కేవలం విమర్శించడమే అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముకున్న టీడీపీ ఆ మేరకు దూసుకుపోతుంది. నవ్విపోదురుగా… అనేస్థాయిలో ప్రభుత్వం చేసిన ప్రతిపనిపైనా విమర్శలు చేసేస్తుంది! జనాలు చూస్తున్నారు.. వింటున్నారన్న విజ్ఞత మరిచిపోతుంది! ఇందులో భాగంగా జగన్ రైతులకోసం పెట్టిన మరో పథకం.. “వైఎస్సార్ జలకళ” విషయంలో మైకందుకున్నారు యనమల రామకృష్ణుడు!

ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుంటే.. ప్రతిపక్షాలు కడిగిపారేయాలి. ప్రజలకు మంచి చేస్తుంటే అభినందించాలి. అంత గొప్ప మనసులేకపోతే మౌనంగా కూర్చోవాలి. అంతే తప్ప నేరుగా రైతులకు ఉపయోగపడే, రైతులకు భారం తగ్గించే పనులపై కూడా అడ్డగోలు వాదనలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయంలో టీడీపీకి అలాంటివేమీ లేవు! అందులో భాగంగా… ఉచిత బోర్ల పేరుతో పంపుసెట్ల భారం వేయడం రైతులకు చేస్తోన్న ద్రోహం అని అంటున్నారు యనమల రామకృష్ణుడు!

ఈ విమర్శలో ఉన్న లాజిక్ ఏమిటో ఆయనకే తెలియాలి! ఇదే సమయంలో వైఎస్సార్ జలకళ పేరుతో రెండు లక్షల బోర్లు వేస్తామనడం హాస్యాస్పదమని విమర్శిస్తూ హాస్యం పండిస్తున్నారు యనమల. అందుకు ఆయన ఎంచుకున్న లాజిక్… జగన్ ప్రభుత్వం 200 అడుగుల లోతు వరకూ మాత్రమే బోర్లు వేస్తే రాయలసీమలో రైతులకు ఎలా ఉపయోగపడుతుండనేది వారి లాజిక్! మిగిలిన ప్రాంతాల్లో 200 అడుగులు అనేది కచ్చితంగా సరిపోతుందనేది ప్రభుత్వ ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చు! రాయలసీమకు మరో 100 అడుగులు పెంచే ఆలోచన ఉండి ఉండొచ్చు!

ఆ విషయాలు గ్రహించినా గ్రహించకున్నా… “జలకళ వల్ల రైతులకు మేలే కానీ… రాయలసీమ రైతులకు 200 అడుగుల లోతు సరిపోదు.. వాటిని మరో 200 అడుగుల లోతువరకూ పెంచేలా ప్రభుత్వం మార్పులు చేయాలి” అని డిమాండ్ చేస్తే టీడీపీకి ఎంత హుందాగా ఉంటుంది? అలా కాకుండా… అసలు ఈ పథకమే హాస్యాస్పధం అని బురదజల్లేస్తే… ప్రజల్లోనూ రైతుల్లోనూ వారి పరిస్థితి హాస్యాస్పధం అయిపోతుందన్న విషయం ఇప్పటికైనా టీడీపీ నేతలు, మరి ముఖ్యంగా యనమల వంటి సీనియర్లు గ్రహించకపోతే ఎలా అనేది.. సగటు టీడీపీ కార్యకర్త ప్లస్ రైతుల అభిప్రాయం!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news