ముద్రగడ వైసీపీ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని ప్రకటించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని.. అభిమానులు, ప్రజలు ను రెచ్చగొట్టి లబ్ది పొందాలని పవన్ చూస్తున్నారని ఆగ్రహించారు.
కాపు ఎమ్మెల్యేలు ను టార్గెట్ చేస్తే వ్యతిరేకత వస్తుందని పవన్ స్ట్రాటజీ తో ద్వారంపూడి ని విమర్శించారని.. లోక్ సభ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కి వెళ్తేనే మాకు అడ్వాంటేజ్ ఉంటుందని వివరించారు. షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
జనసేన ఎన్ని స్థానాలు లో పోటీ చేస్తుందో చెప్పాలని.. అన్ని పార్టీలు లాగానే బీ ఆర్ ఎస్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ప్రసక్తి లేదని.. టీ డీ పీ స్ట్రాటజీ తో ప్రచారం చేస్తుందని వివరించారు. అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ కి ఎన్నికలకు వెళ్తామన్నారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో కూడా ఇదే చెప్పారని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.