రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు మంగళవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి హోదాలో జోక్యం చేసుకోవాలని కోరామని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలకు వాటా, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు చరవ తీసుకోవాలని రాష్ట్రపతి కోరినట్లు వివరించారు ఆర్ కృష్ణయ్య.
బీసీలకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాలలో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇంకా పూర్తిస్థాయి న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు తెలిపారు ఆర్ కృష్ణయ్య.