ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీఎం జగన్ కేంద్రానికి బానిసగా మారిపోయారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిల్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు నారాయణ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుంటానంటే జగన్ మరుసటి రోజు జైల్లో ఉంటాడని ఎద్దేవా చేశారు.
ఇక సిపిఐ కి జాతీయ హోదాను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. సాంకేతికపరమైన అంశాలనే ఈసీ పరిగణలోకి తీసుకుందని.. వందేళ్ల చరిత్ర గల సిపిఐ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గుర్తు చేశారు. ఈసీ నిర్ణయం సిపిఐ నిరుత్సాహపరచలేదన్నారు నారాయణ. సిపిఐ ప్రజల్లో ఉంటుంది.. ప్రజా ఉద్యమాలలో పాల్గొంటుందన్నారు.