తాను అధికారం చేపట్టినప్పటినుంచీ తనదైనశైలిలో పరిపాలన సాగిస్తూ ముందుకుపోతున్నారు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పేదల బ్రతుకులు మార్చే సంక్షేమ పథకాలు.. కరోనా కష్టకాలంలో వైరస్ నియంత్రణకు తీసుకునే చర్యలు.. భవిష్యత్తు బాగుండేలా పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. అన్ని వర్గాలకూ న్యాయం చేసే ఆలోచనలు.. పేదవాడి బ్రతుకు మార్చాలనే ప్రణాళికలు.. మహిళా భద్రతపట్ల భరోసా కల్పించేలా రూపొందించే చట్టాలు..! ఇలా చెప్పుకుంటూపోతే ఎక్కుపెట్టిన చోటికి దూసుకుపోయే మిసైల్ లా జగన్ దూసుకుపోతున్నారు!
జగన్ కు ఇన్ని ఆలోచనలు ఎలా వస్తాయి.. కరోనా సమయంలో బిక్షగాళ్లను సైతం గుర్తుపెట్టుకుని వారికి కరోనా కిట్లు అందించాలనే స్థాయిలో ఆలోచనలు ఎలా చేయగలుగుతారు.. చిన్నా పెద్దా, ఆడా మగా, ధనికా పేదా అనే తారతమ్యాలు ఏమీ లేకుండా… ఒక్క మనిషి – 24 గంటలు – ఒకపక్క పార్టీ, మరో పక్క ప్రభుత్వం!! సమస్యలూ ఇబ్బందులూ ఇక్కట్లూ అయినా ఉన్నవి ఇరవై నాలుగే గంటలు! అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు… అయినా కూడా ఏదో లోటు!! కాదు కాదు అవసరం!! అదే లోటును పూడుస్తున్నారు, అదే అవసరానికి అక్కరకొస్తున్నారంట.. సీఎం జగన్ సతీమణి భారతి!
జగన్ నేడు తీసుకుంటున్న అన్ని పథకాలు, నవరత్నాలు అన్నీ ఆయన పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసి చలించిన మనసుల్లోంచి పుట్టిన ఆలోచనలు.. దాన్ని కాదనేవారు లేరు! ఇదే సమయంలో ప్రత్యేకంగా తీసుకున్న.. ఇంతకు ముందు ఎవరూ కనీసం ఆలోచన కూడా చేయని ఎన్నో పథకాలు జగన్ ప్రభుత్వం చేపట్టింది. అందులో దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, నాడు – నేడు మొదలైన కీలకమైన పథకాల్లో భారతి హస్తం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అటు పార్టీలోనూ, ఇటు ఏపీలోనూ ఇదే హాట్ టాపిక్!!
అవును… జగన్ చేసే ప్రతీ ఆలోచనలోనూ భార్యగా సపోర్ట్ చేయడమే కాకుండా.. ముఖ్యమంత్రి భార్యగా ప్రజల కోసం తాను కూడా కొన్ని మంచి ఆలోచనలు చేయడం.. అవి వివరించడం.. అనంతరం సాధ్యాసాధ్యాలు పరిశీలించడంలో కూడా భారతి – జగన్ కు చాలా సపోర్ట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారంట. “ఒకపక్క వ్యాపారాలు, మరోపక్క కుటుంబ బాధ్యతలు, ఇంకో పక్క ముఖ్యమంత్రి భార్య హోదాలో భర్తకు సలహాలు… శభాష్ భారతి అనకుండా ఉండగలరా జనాలు!