లోకేష్ పై సిబిఐ అస్త్రం ? జగన్ మార్క్ స్కెచ్ రెఢీ ?

-

ఎక్కడా కంగారు పడటం లేదు. మరెక్కడా కంగారు పెట్టించడం లేదు. తాను చేయాల్సింది ఏదో చేసుకుంటూ మెల్లిగా ముందుకు వెళ్ళి పోతున్నా డు ఏపీ సీఎం జగన్. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జైలుకు వెళ్లక తప్పదని, వారిపై అవినీతి ఆరోపణలు రావడం,  వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఏపీ ప్రభుత్వం సేకరించడంతో, ఇక రేపో మాపో అరెస్టు ఉంటుందని ఎప్పటి నుంచో వైసీపీ నాయకులతో పాటు, టిడిపి లోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉంటూ వస్తోంది  కానీ జగన్ వారి జోలికి మాత్రం వెళ్లలేదు. కానీ టిడిపికి బలమైన నాయకుడుగా ఉన్న వారు ఒక్కొక్కరి అవినీతి వ్యవహారాలు ఆధారాలతో సహా బయట పెట్టి జైలుకు పంపించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

ఇక ఇప్పుడు నారా లోకేష్ వంతు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తనను ఏ సిబిఐ ద్వారా అరెస్ట్ చేయించారో అదే సీబీఐని అడ్డం పెట్టుకుని ఇప్పుడు లోకేష్ చుట్టూ ఉచ్చు. బిగిస్తున్నట్టు తెలుస్తోంది. టిడిపి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ పని చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడినట్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ లో 2014 19 మధ్య జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ చేయించాలని ఏపీ ప్రభుత్వం సీబీఐ ను కోరడంతో, లోకేష్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం విచారణ చేపట్టి సుమారు రెండు వేల కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారించింది.
టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ కు,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్వర్క్ మధ్య అవగాహన కుదిరింది. ఈ ఒప్పందంలో అప్పటి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ కు ఈ వ్యవహారంలో సంబంధం ఉందని, కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. వీరేకాక అప్పటి ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరి కృష్ణ ప్రసాద్ సైతం  ఈ అవినీతి లో భాగస్వామ్యం ఉందని సబ్ కమిటీ తేల్చింది. ఇప్పుడు ఈ అవినీతి బాగోతాన్ని వెలికితీసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం తోపాటు, లోకేష్ ను  జైలుకు పంపించాలనే వ్యూహంతో జగన్ ప్రస్తుత ఈ వ్యవహారంపై స్పీడ్ పెంచి సీబీఐ ను రంగంలోకి దించాలని చూస్తున్నారట. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు టిడిపి విషయంలో కఠినంగా ఉండడంతోపాటు, గత ప్రభుత్వం చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వ్యూహాత్మకంగా సిబిఐ ను రంగంలోకి దించి లోకేష్ ను అరెస్టు చేయించా లనే విధంగా జగన్ ప్రయత్నిస్తున్నారు  దీనికి బిజెపి మద్దతు లభిస్తుందనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారట.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news