ఎవరు ఎన్ని మాట్లాడినా, మరెన్ని విమర్శలు చేసినా.. ఎన్ని రకాలుగా అడ్డుపడుతున్నా… తనపని తాను చేసుకుంటూపోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పక్కా ప్లాన్ తో తన రాజకీయ భవిష్యత్తుకు తనదైన అడుగులువేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు జగన్ దృష్టి పరిశ్రమలపై పడింది!
అవును… ముందుగా సంక్షేమంపై పూర్తి శ్రద్ధపెట్టి ఆ పథకాలను గాడిలో పెట్టిన జగన్.. కేవలం ఆ ఒక్కటే సరిపోదని ఆలోచిస్తూ పరిశ్రమలపై దృష్టి పెట్టారు! అందులో భాగంగా… రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్.ఐ.పీ.బీ.) సమావేశం అంగీకారం తెలిపింది. ఈ మూడు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుతో దాదాపు 37 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇది కచ్చితంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి!
అవును… ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లు తమ పరిశ్రమలను ఏపీలో ఏర్పాటు చేసేందుకు జగన్ సమక్షంలో అంగీకారానికి వచ్చాయి. అందులో భాగంగా… చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మంలం ఇనగలూరులో ఇంటెలిజెంట్ సెజ్ లిమిటెడ్ ఫుట్ వేర్ తయారీ పరిశ్రమ.. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఏటీసీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్–హైవే టైర్స్ సంస్థకు చెందిన ఒక యూనిట్.. శాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, ఇంటి గ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు కానున్నాయి!
సంక్షేమం పేరు చెప్పి జనాలకు డబ్బులు పంచుకుంటూ పోతున్నారని ఇంతకాలం విమర్శలు గుప్పించిన చంద్రబాబు & కో కు ఇది మామూలు దెబ్బ కాదు! ఎందుకంటే… సంక్షేమం విషయంలో ఇప్పటికే పేద, మధ్య తరగతి కుటుంబాల మనసులు దోచుకున్న జగన్… ఈ పని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేస్తూ.. ఇదే వేగంతో ముందుకు వెళ్తే.. యువతకు ఉపాది అవకాశాలు దొరకడంతో.. మరింత క్రేజ్ సంపాదించుకున్నవారవుతారు. మరి ఈ విషయంలో జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలు ఇప్పుడు బాబుని ఇరకాటంలో పాడేస్తున్నాయనేది విశ్లేషకుల మాట!