వారికి చావు దెబ్బ – వీరికి చివరి దెబ్బ: తెలంగాణలోనూ వైఎస్సార్సీపీ… లెవెల్ అయిపోద్ది!

-

జగన్ కు రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ – టీడీపీ లనే చెప్పాలి! రాజకీయ శత్రుత్వం వేరు – వ్యక్తిగత శత్రుత్వం వేరు అనే పరిస్థితి జగన్ జీవితంలో ఆ రెండు పార్టీలు తీసుకురాలేదు! కాబట్టి.. జగన్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ – టీడీపీల విషయంలో ఆ రెండూ ఒకటే!!

కాబట్టి… 2019 ఎన్నికల్లో దాదాపు టీడీపీని చావుదెబ్బ తీసేశారు జగన్! ఉన్న కొద్ది పాటి కొన ఊపిరిని.. టీడీపీ మంత్రుల అవినీతి చిట్టాలతో అరెస్టులు చేయించడంతో తీసేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ క్రమంలో జగన్ 2024 ఎన్నికల నాటికో.. ఎన్నికల ఫలితాల నాటికో.. అంతా అనుకూలంగా జరిగితే ఆ లోపో.. టీడీపీ పై ఒక క్లారిటీ ఇచ్చెయ్యొచ్చు!

జగన్ నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్! జగన్ నెక్స్ట్ టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనిపించకుండా చేయడమా? కాంగ్రెస్ ఏపీలో ఎక్కడుంది? రాష్ట్ర విభజన అనంతరం కనుమరుగైపోయిందిగా! కానీ… తెలంగాణలో ఉంది కదా!! కాబట్టి.. తెలంగాణలో వైకాపా పార్టీని జగన్ లాంచ్ చేస్తే… మొదటిగా మూసేసేదీ గాంధీ భవన్ గేట్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులే అనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జగన్ కు మాంచి పేరొచ్చేసింది. పరిపాలనలోనే కానీ.. కరోనా సమయంలో చూపించిన తెగువ, సమర్ధతే కానీ.. మొన్నామద్య వచ్చిన సీ-సర్వే ఫలితాలే కానీ.. ఈ విషయంపై చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రస్థావించడమే కానీ.. ఇందుకు తాజా ఉదాహరణలు! ఈ క్రమంలో.. మిగిలిన రాష్ట్రాలతో పెద్దగా పనిలేకపోయినా.. తెలంగాణలో మాత్రం జగన్ కు పని ఉందనే మాటలు వినిపిస్తున్నాయి!

జగన్ పాలనపై ఇప్పటికే టి.పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డి!! ఇలా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ నేతలు జగన్ ను తెగపొగిడేస్తున్నారు! తెలంగాణలో కేసీఆర్ ను తిట్టే ప్రతి సందర్భంలోనూ వారు జగన్ నే ఆదర్శంగా చూపిస్తూ అధికారపక్షాన్ని వాయిస్తున్నారు! ఈ క్రమంలో జగన్ తెలంగాణలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే… అందులో మొదటిగా చేరేది తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట!

అదే సందర్భంలో… తెలంగాణలో వైఎస్ కి ఉన్న ఫాలోయింగ్ కానీ.. ఆయన చేసిన పనులపై అక్కడి ప్రజలకు ఉన్న కృతజ్ఞతా బావం కానీ.. ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలు కానీ.. ఏపీ కంటే ఎక్కువ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! ఇది కూడా జగన్ కు అత్యదికంగా ప్లస్ అయ్యే అవకాశాల్లో ఒకటి! కాబట్టి అన్నీ అనుకూలంగా జరిగితే… రాబోయే రోజుల్లో జగన్ తెలంగాణలో కూడా పార్టీని ప్రారంభిస్తే… కచ్చితంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు! అదే జరిగితే… “ఏపీలో టీడీపీకి చావు దెబ్బ – తెలంగాణలో కాంగ్రెస్ కి చివరి దెబ్బ”.. లెవెల్ అయిపోద్ది!!

Read more RELATED
Recommended to you

Latest news