ఉమ ఉదాహరణల్లో “బాబు భౌతిక భవన్” ‌ఒకటి!

-

చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని తెగ ఆయాసపడిపోతున్నారు సారీ సారీ ఆవేశపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ! అసలు చంద్రబాబు హయాంలో మాములు పథకాలు ప్రవేశపెట్టలేదని.. వాటన్నింటినీ జగన్ తుంగలోకి తొక్కేశారని.. ఫలితంగా జనాలు ఇబ్బందిపడుతున్నారని చెప్పుకొచ్చారు ఉమ! దానికి ఉదాహరణగా ఉమ చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి!!

చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని జగన్ ప్రభుత్వం వచ్చినతర్వాత రద్దు చేశారని చెబుతున్నారు ఉమ! అందులో ముఖ్యంగా చెబుతున్నవి రెండు కాగా… వాటిలో ఒకటి చంద్రన్న భీమా కాగా రెండోది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంతిమ యాత్ర భవన్ నిర్మాణం!

అవును… విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అద్దె ఇళ్లలో ఉండేవారు ఎవరైనా చనిపోతే.. వారి భౌతికకాయాన్ని సొంతవారు చూసుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో రూ.70 లక్షలతో బాబు భౌతిక భవన్ ‌ను నిర్మించారని… కానీ జగన్ సీఎం అయ్యాక అది రద్దు చేశారని వాపోతున్నారు బోండా ఉమ! ఉదాహరణలు ఏమైనా చెప్పాలంటే చంద్రన్న భీమా, సంక్రాతి పప్పు, భౌతిక భవనం వంటివి కాకుండా రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ ఉపయోగపడే విషాలు చెప్పకుండా.. సీన్ చిన్నది డైలాగులు పెద్దవి అన్నట్లుగా ఉమ నీరు గార్చారు!

బోండా ఉమ మరో విమర్శ ఏమిటంటే… 16 నెలలలో వైసీపీ పాలనలో ప్రజలకు ఉపాయపగపడే పథకాలు ఏమి ప్రవేశపెట్టలేదు అని! దీంతో.. ఉమకు అధికారంలో ఉన్నప్పుడు మైకంలో కళ్లు మూసుకుపోయాయని తెలుసు కానీ… అధికారం, పదవి రెండూ పోయిన తర్వాత కూడా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూడలేనంతగా మూసుకుపోయాయని తాము భావించలేదని అంటున్నారు వైకాపా నేతలు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news