ఎన్డీయే కూటమికే జై కొట్టిన జగన్ !

-

YSRCP Likely To Support NDA: ఎన్డీయే కూటమికే జై కొట్టారట జగన్. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లాకి తన మద్దతు అని అధికారిక ప్రకటన చేశారు. జగన్ సూచనలు మేరకు ఎంపీలు ఈ మేరకు ప్రకటించారు.

ఎన్డీయే కూటమికే జై కొట్టిన జగన్ !

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో వైసీపీని ఓడించిన జగన్ మాత్రం ఎన్డీయే వైపే మొగ్గు చూపడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా, దేశచరిత్రలో 48 ఏళ్ల తర్వాత ఇవాళ లోక్​సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా నామినేషన్ వేయగా, లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఇండియా కూటమి ఎంపీ కె. సురేశ్​ను బరిలోకి దింపింది. ఆయన కూడా మంగళవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. 1976 తర్వాత ప్రతిసారి ఏకగ్రీవంగానే స్పీకర్‌ ఎన్నిక జరగగా ఈసారి మాత్రం ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news