ఏపీలో మహిళలపై దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలపై దాడులు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు వరుస ఘటనలు నమోదవడంలో మహిళలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పదో తరగతి బాలిక పట్ల ఓ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏటి అగ్రహారం లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో కి బాలిక ను పిలిచిన కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించినట్టు బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. తెలిసిన వ్యక్తి కావడం తో కానిస్టేబుల్ పిలవగా బాలిక ఇంట్లో కి వెళ్లింది. దాంతో బాలిక పట్ల కానిస్టేబుల్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై విచారణ చేసిన ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ కానిస్టేబుల్ రమేష్ ను సస్పెండ్ చేశారు. కొత్తపేట స్టేషన్ లో నింధితుడు రమేష్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు.