తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ సంస్థలున్నాయి.. ఏపీ హైకోర్టు సీరియస్

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. పౌరుల హక్కులకు విఘాతం కలిగించే చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీరియస్ అయ్యింది. రాజ్యాంగం అందించిన హక్కులను మరోమారు గుర్తు చేసింది. ప్రాథమిక హక్కులతో పాటు రిట్లు కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. అందులో హెబియస్ కార్పస్ రిట్ ప్రత్యేకమైనది. ఎవరైనా పోలీసు అధికారులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పౌరులపై చర్య తీసుకున్నప్పుడు, దాన్ని సవాల్ చేస్తూ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేసే అవకాశాన్ని కల్పించింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కొల్లూరు ప్రాంతంలోని షేక్ అక్తర్ రోషన్ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసారు. ఇద్దరు వ్యక్తులను చట్ట వ్యతిరేకంగా కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేసారంటూ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు పోలీసు అధికారుల మీద సీరియస్ అయ్యింది. తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ సంస్థలు ఉన్నాయని, ఈ విషయమై ఏడీజీ అధికారితో మాట్లాడి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news