మొబైల్ పేలుడుకు సంబంధమే లేదు : వినియోగదారుడిపై పరువు నష్ట దావా వేసిన వన్ ప్లస్ కంపెనీ !

-

చైనా దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్… ఓ వినియోగదారుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వన్ ప్లస్ మొబైల్ తన జేబులో పేలిందని… పేర్కొన్న ఆ వినియోగదారుడిపై పరువు నష్టం దావా వేసింది వన్ ప్లస్ కంపెనీ. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఢిల్లీ కి చెందిన గౌరవ్ గులాటి అనే న్యాయవాది వన్ ప్లస్ 5జి మొబైల్ ను కొనుగోలు చేశారు. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఆ వన్ ప్లస్ మొబైల్ ఆయన వేసుకునే కోర్టులో ఒక్కసారిగా పేలింది.

దీంతో వన్ ప్లస్ కంపెనీ పై ఆ న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ చైనా కంపెనీ అందరినీ మోసం చేస్తుందని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. అయితే ఆ పిటిషన్ పై వన్ ప్లస్ కంపెనీ… ఊహించని రీతిలో స్పందించింది.

తమ కంపెనీపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ… న్యాయవాది గౌరవ్ లాటికి లీగల్ నోటీసులు పంపించింది వన్ ప్లస్ కంపెనీ. తమ కంపెనీ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ… ఫైర్ అయ్యింది. ఆయన జేబులో మొబైల్ పేలడానికి తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.తమ కంపెనీ మొబైల్లలో ఎలాంటి అవకతవకలు లేవంటూ స్పష్టం చేసింది వన్ ప్లస్ కంపెనీ.

Read more RELATED
Recommended to you

Latest news