ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.నెల్లూరు సిటీ లో ఇకపై ఎవరైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు అన్నారు.రెండున్నరేళ్లుగా ఫ్లెక్సీ రహిత నగరంగా నెల్లూరు సిటీ ని ఉంచగలిగామన్నారు.ఫ్లెక్సీలు కట్టొద్దు అంటే కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.ప్రతిపక్షాలతో పాటు తమ పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరికీ లేని బాధ నా ఒక్కడికే ఎందుకు..ఇకనుంచి ఫ్లెక్సీలపై ఎలాంటి నిబంధనలు లేవన్నారు.తనకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాలేదన్నారు.ప్రమాణ పూర్తిగా ఇది తన నిర్ణయమే అని పేర్కొన్నారు.
అనిల్ గుండాయిజం చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు…తాను గనుక గుండాయిజం చేస్తే ఫ్లెక్సీలు కట్టిన వారి చేతులు ఉండేవా? అంటూ ప్రశ్నించారు.అలాంటివి తాను చేయనున్నారు.నెల్లూరు సిటీ లో గతంలో తన ఫ్లెక్సీలు కట్టలేదని..ఇకపై కట్టేది లేదని తేల్చి చెప్పారు.ప్రతిపక్ష నేతలు ఫ్లెక్సీలు సహా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు సైతం తొలగించడంపై నెల్లూరులో రాజకీయ వర్గపోరు రాజుకుంది.