బాబుకు షాక్: అనిల్ కుమార్ ఛాలెంజ్ కం లాజిక్!

-

ఏపీలో గతకొన్ని రోజులుగా వరుసగా అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అవీనీతి కేసులో అచ్చెన్నాయుడు, అక్రమాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, దౌర్జ్యన్యాల విషయంలో చింతమనేని, నిస్సిగ్గు వ్యవహారంలో అయ్యన్నపాత్రుడు, హత్యా రాజకీయాల విషయంలో కొల్లు రవీంద్రలు ఒకరితర్వాత ఒకరు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేసీ, చింతమనేని విషయంలో పెద్దగా లాజిక్కులు లాగలేని టీడీపీ నేతలు… మిగిలిన ముగ్గురీ విషయంలో మాత్రం బీసీ కారుడును బయటకు తీశారు. వీటిపై తాజాగా స్పందించిన ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్… టీడీపీ నేతలకు ఒక ఛాలెంజ్ విసురుతూనే, బలమైన లాజిక్ లాగారు!

శాసనమండలిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసభ్యంగా ప్రవర్తించారని, మహిళా సభ్యుల ముందుకెళ్లి జిప్ తీస్తానంటూ సైగలు చేసి అనుచితంగా మాట్లాడారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే మంత్రి అనీల్ కుమార్ ఛాలెంజ్ విసిరారు. కాని శాసనమండలి నుంచి స్పందన రాలేదు. ఫలితంగా ఇప్పుడు మరోసారి అప్పటి సవాల్ ను గుర్తుచేశారు మంత్రి.

శాసన మండలిలో మహిళల ముందు తాను జిప్ తీశానంటూ క్యారెక్టర్ ను కించపరిచేలా లోకేష్ చౌదరి, రాజేంద్రప్రసాద్ చౌదరిలు తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఆరోజే సవాల్ విసిరిన విషయాన్ని గుర్తుచేస్తూ… ఆ వీడియో ఉంటే రిలీజ్ చేయమని ఛైర్మన్ కు నేను లేఖ రాసి 15 రోజులైందని.. ఇప్పటివరకు టీడీపీ నుంచి సమాధానం లేదని.. వీడియో ఉంటే బయటపెట్టమని మరోసారి ఛాలెజం విసిరారు!

అనంతరం అనీల్ కూడా “బీసీ కార్డు” తీసి బాబుకు షాకిచ్చారు. ఓ బీసీ అయిన తనను ఇష్టమొచ్చినట్టు ఏదైనా అనొచ్చనే అహంకారం టీడీపీ నేతల్లో ఉందని చెబుతూ.. తనను కూడా గతంలో గొర్రెలు కాసుకునే వ్యక్తి అంటూ అవమానించారని గుర్తుచేశారు. వైసీపీలో ఉన్న బీసీలను తిట్టినా, అవమానించేలా మాట్లాడినా టీడీపీ నేతలకు తప్పు అనిపించడం లేదు కానీ… నేరాలు చేసిన టీడీపీకి చెందిన బీసీ నేతలను అరెస్ట్ చేస్తే మాత్రం తప్పా అని ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు పేదల సొమ్ము 150 కోట్లు కాజేశాడు.. అయ్యన్నపాత్రుడు ఓ మహిళను పట్టుకొని గుడ్డలూడదీసి కొడతానన్నాడు.. కొల్లు రవీంద్ర ఏకంగా హత్యకు సహకరించాడు.. వీళ్లు బీసీలు కాబట్టి ఏం అనకూడదా? బీసీలు టీడీపీలో ఉంటే ఒక నీతి, ఇతర పార్టీల్లో ఉంటే మరో నీతా? అంటూ అనీల్ బాబుపై ప్రశ్నల వర్షాలు కురిపించారు!

ఏది ఏమైనా.. అవినీతి, అక్రమలు, ఆఖరికి హత్యానేరంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా సమర్ధించుకోవడానికేమీ లేక బీసీ కార్డు తీసిన బాబు & కోలకు మరో బీసీ మంత్రి అనీల్ నుంచి సూపర్ ఛాలెంజ్ కం లాజిక్ పడిందని అంటున్నారు నెటిజన్లు!!

Read more RELATED
Recommended to you

Latest news