వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు ఆయనకు దూరం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ వార్త మరువక మునుపే ఇంతలో తాజాగా మరొక చేదు అనుభవం ఆయనకు ఎదురయింది. గత కొంత కాలంగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.

YSRCP MLA knocks court doors after TDP drops criminal cases

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు ఆయన వచ్చారు. ఆ సమయంలో అక్కడ కొంతమంది గుమికూడి ఉన్నారు. వారంతా తన కోసమే వచ్చారని భావించిన ఆర్కే వారి ముందు కారు ఆపారు. అయితే, ఆర్కే ఊహించని విధంగా వారంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని ద్రోహి అంటూ మండిపడ్డారు. దీంతో, ఆయన వెంటనే తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానిక మహిళలు సైతం ఆర్కేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.