BREAKING : తెలంగాణలో మరో ఉప ఎన్నిక..?

-

BREAKING : తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల పర్వం కొనసాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత, దాదాపు 6 ఉప ఎన్నికలు జరిగాయి. అయితే.. ఈ ఉప ఎన్నికల కారణంగా, ఎక్కువగా బీజేపీ పార్టీకి లబ్ది జరిగింది. కానీ మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది.

ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. మునుగోడులో గులాబీ పార్టీ జెండా రెపరెపలాడింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఇక కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది.

అయితే, ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ బోల్తా కొట్టడంతో, తెలంగాణ లో మరో ఉప ఎన్నిక రాబోతుందని.. ఆ పార్టీ వర్గాలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. వేముల వాడలో ఈ ఉప ఎన్నిక జరుగుతుందని ఆ పోస్టులు పేర్కొంటున్నారు. అయితే, వాస్తవానికి ఈ ఉప ఎన్నిక అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా, ఇప్పుడేలా ఉప ఎన్నిక వస్తుందని కుండ బద్దలు కొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news