తెలుగు రాష్ట్రాలకు మరో జాతీయ లింక్​ రోడ్డు మంజూరు

-

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల కు మరో జాతీయ లింక్ రోడ్డు మంజూరు అయింది. కొల్లాపూర్ 167 కె జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన డి పి ఆర్ కు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదముద్ర వేసింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి పలు సంస్థలు రూపొందించిన డీపీఆర్ ను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఫలితంగా అధికారులు రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి అవకాశం ఉంది.

ఈ రహదారి నిర్మాణం తో హైదరాబాదు నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. అంతే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సోమశిల వంతెన నిర్మాణం కూడా పూర్తి కానుంది. రెండు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న కొల్లాపూర్ జాతీయ రహదారి దాదాపు 170 మూడు కిలోమీటర్ల పొడవు ఉండనుంది. ఈ రహదారిపై 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా నిర్మాణం చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బైపాస్ అలాగే రీ అలైన్మెంట్ల నిర్మాణాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news