ఒకప్పుడు చద్దన్నం అంటే పడి చచ్చిపోయేవారు.. అది ఆరోగ్యానికి మంచిది కూడాను.. రాను రాను పాత పద్ధతులకు స్వస్తీ చెప్తూ విధేశీ కల్చర్ కు జనాలు అలవాటు పడుతున్నారు.. అందుకే మన దేశంలో ఎక్కడ చూసిన జంక్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువయ్యాయి.. వాటి వల్ల ప్రమాదం అని చెప్పినా జనాలు వాటికే మొగ్గు చూపిస్తున్నారు.. ముఖ్యంగా షవర్మా.. దీంట్లో వాడే ఫ్లేవర్స్ వల్ల చాలా మంది ఇష్టపడుతున్నారు.. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమి లేవు.. మొన్నీమధ్య కేరళలో దీనివల్ల ప్రాణాలు కూడా పోయాయి. అది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది..
ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో.. ఆపరేషన్ షవర్మలో భాగంగా రూ.36,42,500 జరిమానా వసూలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8224 సంస్థలను తనిఖీ చేశారు. 2023 జనవరి 1 నుంచి మొన్నటివరకు 6689 సంస్థలను తనిఖీ చేశామని మంత్రి సభలో పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో దోషులుగా తేలిన 317 సంస్థలను మూసివేశామని, 834 సంస్థలకు నోటీసులు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. షవర్మా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందన్న నివేదికలు పెరగడంతో రాష్ట్రంలో షవర్మా తయారీకి ఏకరీతి ప్రమాణాలు తీసుకొస్తామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ గతంలో ప్రకటించారు.
అయితే రాష్ట్రంలో పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ తయారీ, నిల్వ, విక్రయాలపై నిషేధం విధిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఇక మయోనైజ్ సకాలంలో ఉపయోగించకపోతే చాలా ప్రమాదకరమని అధికారుల తనిఖీల్లో తేలింది. హోటల్, రెస్టారెంట్, బేకరీ, వీధి వ్యాపారులు, క్యాటరింగ్ రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్పై నిషేధానికి పూర్తి మద్దతు లభించింది..దీన్ని కూడా నిషేదించారు.. మొత్తానికి రెండు ప్రాణాలకు హానీ కలిగిస్తున్నాయి.. అందుకే జాగ్రత్త..