వైసీపీ ప్ర‌భుత్వంపై యాంటీ ప్ర‌చారం.. క‌ర్త క‌ర్మ క్రియ ఆయ‌నేనా…?

-

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడాది పూర్త‌యింది.  అత్యంత భారీ మెజారిటీతో.. ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీని కూల‌గొట్టి మ‌రీ.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌కు ఈ ఏడాది కాలం చిన్న‌దేం కాదు.. అ దేస‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా దీనిని త‌క్కువ‌గా ఏమీ చూడ‌డం లేదు. ఎందుకంటే.. మొత్తం ఐదేళ్ల అధి కారం స‌మ‌యంలో చి వ‌రి ఏడాది ఎలాగూ.. ఎన్నిక‌ల హ‌డావుడి త‌ప్ప‌దు. ఇక‌, మిగిలింది నాలుగేళ్లే.. ఏం చేయాల‌న్నా.. ఈ నాలుగేళ్ల‌లోనే. అయితే, ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు ఏడాది ముగిసిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇక‌, ఆయ‌న‌కు ఏం చేయాల‌న్నా.. మూడేళ్లు మాత్ర‌మే మిగిలింది.

మ‌రి ఇప్ప‌టికే పూర్త‌యిన ఏడాదిలో ఏం సాధించారు? అంటే.. తాజాగా అన్ని వ‌ర్గాల వారి నుంచి వినిపిస్తు న్న ఏకైక మాట.. ప్ర‌జ‌ల సొమ్ము పందేరం! అని! వివిధ సంక్షేమ ప‌థ‌కాల్లో కీల‌క‌మైనవి అన్నీ కూడా జ‌గ‌న్ పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే అమ్మ ఒడి స‌హా.. వాహ‌న మిత్ర‌, రైతు భ‌రోసా .. వంటి కీల‌క ప‌థ‌కాల కింద సొమ్ములు పందేరం చేశారు. ఇంత‌కుమించి ఆయ‌న ఏమీ చేయ‌లేద‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తోంది. అయితే, నిజానికి ఇంత‌కే ప‌రిమిత‌మ‌య్యారా?  జ‌గ‌న్ ఇంత‌కు మించి ఏమీ చేయ‌లేదా?  కేవ‌లం డబ్బులు పంచేసి ఊరుకున్నారా? అంటే.. నిజానికి అలాంటి దేమీ లేదు.

వ్యూహాత్మ‌కంగా ఆయ‌న అనేక చ‌ర్య‌లు తీసుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లు తెచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. తాను నేరుగా విదేశాల‌కు వెళ్ల‌క‌పోయినా.. త‌న వారిని పంపించి.. ప‌రిశ్ర‌మ‌లు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిం చారు. అదే స‌మ‌యంలో అనేక కీల‌క విష‌యాల్లోనూ నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే, వీటికి ఎలాంటి ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం.. ఎక్క‌డా వాటి గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డ‌మే.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారుకు మైన‌స్‌గా మారిపోయింది.

గ‌తంలో చంద్ర‌బాబు మితిమీరిన ప్ర‌చారం చేసుకుంటే.. ఇప్పుడు జ‌గ‌న్ అస‌లు చేసింది కూడా చెప్పుకోక‌పోవ‌డం.. కేవ‌లం పందేరం చేసే ప్ర‌భుత్వంగానే బ్యాడ్‌నేమ్ తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి  ఈ ప‌రిస్థితి మారాలంటే.. నెల‌కు ఒక్క‌సారైనా మీడియా ముందుకు వ‌చ్చి చేసింది చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news