దళితులు – అభివృద్ధి: వర్ల భుజంపై బాబు తుపాకీ…!

-

ప్రస్తుతం టీడీపీ తమ ఓటమికి గల కారణాలపై ఆత్మ విమర్శ చేసుకోవడం మానేసి.. వాటిని కులాల వారీగా విభజించి, జనాలపైకి రుద్దేసే ఆలోచనలకు ఒడిగడుతుంది! ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఇలాంటి ఆలోచనలు ఎంతవరకూ సరైనవి, మరెంతవరకూ కాదు అనే విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ… ఏ సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడు.. టీడీపీ ఓటమిని ఆయాకులాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఎంత చేసినా.. జనాలు అర్ధం చేసుకోలేకపోయారు అన్న స్థాయిలో మాట్లాడుతూ… వారి అజ్ఞానాన్ని జనాలపైకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

అసెంబ్లీలో ధర్మాన ప్రసాద రావు అన్నట్లు… చంద్రబాబు ఓటమికి సంబందించిన కారణాలతో ఒక పెద్ద చిట్టానే ఉంది! ఇక్కడ చిత్రం ఏమిటంటే… తాను ఎందుకు ఓడిపోయాడో అందరికీ తెలుసు, కానీ ఆయన తెలియనట్లు యాక్ట్ చేస్తారు.. ఆయన చుట్టుపక్కనున్నోళ్లు కూడా ఆ కారణాలు చెప్పరు అంటూ చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ధర్మాన అన్నారని కాదు కానీ… తామెందుకు ఓడిపోయామన్న విషయం టీడీపీ నేతలకు తెలుసు, చంద్రబాబుకు అంతకంటే ఎక్కువగా తెలుసు. ఎందుకు ఓడించారో ప్రజలకు ఇంకా బాగా తెలుసు!

ఈ విషయంలో… మహానాడు వేదికగా స్పందించిన అచ్చెన్నాయుడు… తమ ప్రభుత్వంలో బీసీలకు ఎన్నో చేసినా కూడా వారు ఎందుకో తమను నమ్మలేదని, అర్ధం చేసుకోలేదని అన్నారు! నేరం అంతా బీసీలదే అని ఆయనంటే… ఇక భారమంతా బీసీలదే అని బాబు సన్నాయినొక్కులు నొక్కారు. ఇదే క్రమంలో తాజాగా వర్ల రామయ్య మైకందుకున్నారు. చంద్రబాబు హయాంలో దళుతులకు మామూలు న్యాయం జరగలేదని. దళితుల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన కృషి వర్ణణాతీతమని, దళితులకు బాబు ఎంతో చేశారని.. కాని వారు జగన్ ని నమ్మి మోసపోతున్నారని చెప్పుకొస్తున్నారు.

అసలు దళితులను మనుషులుగా కూడా చూడని ప్రభుత్వం టీడీపీ అని, దళితులపై ఈరోజుల్లో కూడా కడుపునిండా వివక్ష పెంచుకున్న వ్యక్తి చంద్రబాబు అని అప్పట్లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి బాబు దళితులను ఏదో ఉద్దరించారన్నట్లుగా వర్ల రామయ్య మాట్లాడం ఏమిటని అప్పుడే విమర్శలు మొదలైపోతున్నాయి. దళితుల అభివృద్ధికి చంద్రబాబు & కో ఏమి చేశారు అన్న విషయం కాసేపు పక్కనపెడితే… అసలు వారిని ఎలా చూశారు అన్న విషయం ఆన్ లైన్ లో ఇప్పటికీ స్థిరంగా ఉందని.. దళితుల మనసులో ఎప్పటికీ సజీవంగా ఉంటుందనే విషయం మరిచిపోకూడదని పలువురు సూచిస్తున్నారు.

ఈ మాత్రం సమాధానానికి ఏకంగా ఏపీ ప్రభుత్వం చర్చకు రావాలని వర్ల రామయ్య సెలవిస్తున్నారు! అక్కడితో ఆగారా… ఈ విషయంపై వారో వీరో కాదంట.. ఏకంగా నేరుగా సీఎం జగన్ తోనే చర్చకు రెడీ అంట. ప్లేసు మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే… టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అన్న రేంజ్ లో సవాళ్లు విసిరేస్తున్నారు వర్ల! నిజంగా ఈ చర్చే జరిగితే… అభాసుపాలయ్యేది వర్ల రామయ్యా లేక చంద్రబాబా? గెలిస్తే కచ్చితంగా చంద్రబాబు… ఓడిపోతే నూటికి నూరుశాతం వర్ల రామయ్య! దళితులతో రాజకీయాలు బాబు ఆడిస్తున్నారో, వర్లే ఆడుతున్నారో తెలియదు కానీ… బాబు మాత్రం వర్ల భుజంపై తుపాకీ పెడుతున్నారని అర్ధం అవుతుందనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news