బంపర్ ఆఫర్ కొట్టేసిన అనుపమ.. ఇకనైనా దశ తిరుగుతుందా..?

-

మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతోనే తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈమె నటించిన కార్తికేయ 2 చిత్రం కూడా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ ఒక్క సినిమాతోనే ఈమె కెరియర్ మారిపోయింది అంటున్నారు నెటిజన్స్. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. మంచి కంటెంట్ అండ్ విజువల్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకు వెళ్తూ ఉండడం గమనార్హం.

ఇదిలా ఉండగా తాజాగా ఈ భామకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే నిన్నటి వరకు సస్పెన్షన్ లోనే ఉంచిన ఈ విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు .అనుపమ బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం డీజే టిల్లూ లో నటించడానికి సిద్ధంగా ఉంది. నేహా శెట్టి ప్లేస్ లో అనుపమ నటించబోతోందని సమాచారం .అంతేకాదు ఇప్పటికే అనుపమ ఈ సినిమా కోసం ఒప్పందంపై సైన్ చేసినట్లుగా తెలుస్తోంది . ఈ సినిమా డిజె టిల్లు సీక్వెల్ గా సిద్దు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ , డైలాగ్స్ అన్నీ కూడా సిద్దు జొన్నలగడ్డ రాస్తూ ఉండడం గమనార్హం. ఇక త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోంది.Anupama Parameshwaran in DJ Tillu Sequel

ఇక అనుపమ పరమేశ్వరన్ కు తెలుగు తో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా మంచి పాపులారిటీ ఉంది. ఈ భామ వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమా ద్వారా మొదటిసారి నటించింది. ఇక డీజే టిల్లు సీక్వెల్ తో ఈమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. ఆ తర్వాత ఈమె కెరియర్ ఎలాంటి ఊపు అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news