మలయాళీ ముద్దుగుమ్మ క్యూట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన” అ..ఆ..”సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఈ సినిమాతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో తెలుగులో వరుసగా అవకాశాలు కూడా క్యూ కట్టాయి. అంతకుముందే ఈమె ప్రేమమ్ సినిమాతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. ఇకపోతే గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ను సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతుంది. వాస్తవానికి మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ కూడా అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులను అలరించింది.
ఇదివరకే శతమానం భవతి , హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి చిత్రాలలో నటించి మెప్పించిన అనుపమ చేతిలో ప్రస్తుతం కొన్ని చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోవడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో అనుపమ షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. కొప్పున మల్లెపూలు పెట్టి ఎల్లో కలర్ సారీ అందుకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ గా గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి.. అందుకు తగ్గట్టు మ్యాచింగ్ జువెలరీలో చాలా అద్భుతంగా మెరిసిపోతోంది.. అంతేకాదు ఈ ఫోటోలకు ఆమె కొంటెగా ఫోజులిస్తూ కసిగా ప్రేక్షకులను కవ్విస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజెన్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. హుందాగా అంతే అందంగా ఉన్న అనుపమా లుక్కు.. చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు. మొత్తానికైతే ఈ ఫోటోలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram