మణిపూర్ సమస్యపై ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఆ అంశంపై చర్చించేందుకు ఎందుకు పారిపోతున్నారంటూ ఆయన విపక్షాలను ప్రశ్నించారు. మణిపూర్ సమస్యపై చర్చించేందుకు తాము మొదటి రోజు నుంచే సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మణిపూర్‌లో పర్యటించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు.. పశ్చిమ బెంగాల్‌కు ఎందుకు వెళ్లలేదని అనురాగ్ ఠాకూర్ నిలదీశారు. గతంలో యూపీఏ హయాంలోనూ మణిపూర్‌లో ఆరు నెలలపాటు హింస చెలరేగిందని చెప్పారు. అయినా అప్పటి ప్రధాని, కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని విమర్శించారు.