అమెజాన్ ప్రైమ్ లోకి అనుష్క ‘నిశ్శబ్దం’.. ఎప్పుడంటే..?

-

అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విషయం తెలిసిందే. పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఎంతో మంది దర్శక నిర్మాతల్ని ఆకర్షిస్తుంది. అయితే ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలు లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో మూగ చెవిటి అమ్మాయి గా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తుంది అనుష్క. అయితే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి సినిమా థియేటర్లు మూత పడిన విషయం తెలిసిందే.

అయితే ఇన్ని రోజుల వరకు సినిమా థియేటర్లు తెరుచుకుంటాయి అని వేచి చూసిన చిత్ర బృందం ఎట్టకేలకు ఈ సినిమాని ఓటిటి వేదికగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించింది. అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా నిశ్శబ్దం సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news