పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ద్వారకాతిరుమల మండలం మాలసానికుంట గ్రామానికి చెందిన గురజాల ఆదిలక్ష్మి అనే మహిళ డిసెంబర్ 2017లో తన ఇంటిపై అప్పటికి ఎమ్మెల్యేగా లేని తలారి వెంకట్రావు దాడి చేశారని పియస్ లో ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి నుండి కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది సదరు ఆదిలక్ష్మి అనే మహిళ.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్యే వెంకట్రావు, మరో మహిళా నేతతో పాటు మరో 11 మంది పై కేసు నమోదు చేయాల్సి వచ్చింది. 448, 506, rw 34 ipc సెక్షన్ల కింద ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత తొలిసారి ద్వారక తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జేబుని అప్పట్లో కొట్టేశారు దొంగలు. అలా ఆయన అప్పట్లో వార్తల్లోకి వచ్చారు. అలానే గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని రాజంపాలెంలో ఆగస్ట్ 5న సీఎం జగన్‌కు కడుతున్న గుడికి శంకుస్థాపన చేసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు ఎమ్మెల్యే తలారి వెంకటరావు.