పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే వేడుకలు ఈ శుక్రారం జరిగిన విషయం తెలిసిందే. ఈ 23తో 41 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రభాస్ 42వ ఇయర్‌లోకి ఎంటరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కు నెటిజన్స్, ఫ్యాన్స్, సెలబ్రిటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలతో సోషల్‌మీడియాను హోరెత్తించారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అనుష్క ట్వీట్‌పై పడింది.
గత కొంత కాలంగా అనుష్క – ప్రభాస్‌లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క ఎలా ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ తెలియేస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా ఊహించినట్టే అనుష్క ట్వీటేసింది. దీంతో అంతా అవాక్కవుతున్నారు. అనుష్క ప్రభాస్‌ని విష్ చేస్తూ పెట్టిన పోస్ట్ నేషనల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
`హ్యపీ హ్యపీ హ్యపీ హ్యపీ పుప్సు` ప్రభాస్ నిక్‌నేమ్‌ని బయటపెట్టి అనుష్క శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. లేదు లేదంటూనే ఏదో వుందనే సంకేతాల్ని అనుష్క ట్వీట్ హింట్ ఇస్తోందని అంతా అంటున్నారు. చాలా మంది ఇద్దరి మధ్య నిజజంగానే ఏదో జరుగుతోందా? అని ఆరాతీస్తున్నారు.
దీనికి తోడు 38 ఏళ్ల అనుష్క ఇప్పటికీ మరో చిత్రాన్ని అంగీకరించలేదు. రెండు చిత్రాల్ని అంగీకరించానని చెబుతున్నా వాటి వివారాలు చెప్పకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
Happy happy happy happy pupsu ..totally love the feel and look of radhe Shyam ….🥰looking forward 🎉 🎉 🎉 🎉UV creations 😊 ,Radha Krishna garu ,Pooja ,cast and crew …all the very best 🎉 🎉 🎉 🎉https://t.co/vr2Pglxu0v
— Anushka Shetty (@MsAnushkaShetty) October 23, 2020