ఆందోళన; ఆస్ట్రేలియా మళ్ళీ అంటుకుంది, ఫిబ్రవరిలో భారీ మంటలు చెలరేగే అవకాశం…!

-

అగ్నిప్రమాదానికి గురైన తూర్పు ఆస్ట్రేలియాలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం కాస్త చల్లబడటంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్నాళ్ళుగా స్థిరమైన వేడి వాతావరణం ఉండటంతో పాటుగా, కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా పడకపోవడంతో మంటలు మరింత రెట్టింపు అయ్యాయి. భారీ అగ్నీ కీలలు ప్రధానంగా న్యూసౌత్ వేల్స్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాయి.

దీనితో గురువారం కురిసిన భారీ వర్షాలు పరిస్థితిని కాస్త అదుపులోకి తెచ్చాయి. ఈ వర్షాలు మంటలను పూర్తిగా ఆపలేకపోయినా సరే పరిస్థితిని మెరుగు పరిచాయని అధికారులు అంటున్నారు. వర్షాలకు ముందు, న్యూ సౌత్ వేల్స్ లో 30 ప్రాంతాల్లో మంటలు అదుపు చేయలేకపోయారు. గత కొన్నాళ్ళుగా తీవ్ర స్థాయిలో ఉన్న మంటలు అదుపులోకి రావడంతో ఉష్ణోగ్రతలు తగ్గి గాలిలో తేమ పెరిగింది.

కాని వర్షాలు ఇంకా చాలా అవసరమని అక్కడి ప్రజలు అంటున్నారు. అయితే గాలిలో ఇంకా బూడిద ఎక్కువగా ఉందని అది తగ్గితే ఆక్సీజన్ అందుతుందని అధికారులు అంటున్నారు. బుష్ఫైర్ల నుండి పొగ సోమవారం నుండి బుధవారం వరకు దక్షిణ నగరమైన మెల్బోర్న్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది, వచ్చే వారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహణకు అంతరాయం కలిగించింది.

దక్షిణ రాష్ట్రమైన విక్టోరియాలో మంటల తీవ్రత గురువారం శుక్రవారం భారీగా తగ్గింది. “తుఫానులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపర్చాయి” అని విక్టోరియన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఇక శుక్రవారం శనివారం భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఫిబ్రవరి, మార్చ్ లో ఎండలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో కార్చిచ్చు ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news