ఏపీ బడ్జెట్‌లో హైలైట్స్ ఇవే..టీడీపీ సభ్యుల సస్పెండ్!

-

ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే..ప్రశ్నోత్తరాల సమయంలో తమకు మాట్లాడటానికి మైకు ఇవ్వాలని టి‌డి‌పి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో సీఎం జగన్ సీరియస్ అయ్యి.. సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు తెలిపారు. దీంతో స్పీకర్ 13 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. టి‌డి‌పి సభ్యుల సస్పెన్షన్ అనంతరం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

మొత్తం 2.79 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ని ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు ఉండగా, మూల ధన వ్యయం 31,061 కోట్లు ఉంది.  రెవెన్యూ లోటు  22,316 కోట్లు, ద్రవ్య లోటు 54,587 కోట్లుగా ఉంది. జీఎస్డీపీలో రెవిన్యూ లోటు  3.77 శాతం, ద్రవ్య లోటు 1.54 శాతంగా ఉంది.

ఇక శాఖల వారీగా కేటాయింపులు చూస్తే..

  • ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు
  • వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు
  • వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు
  • పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు
  • బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు
  • పర్యావరణానికి రూ.685 కోట్లు
  • జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు
  • హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు
  • గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు
  • గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు
  • నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు
  • మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు
  • కార్మిక శాఖకు రూ.796 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.215 కోట్లు
  • న్యాయశాఖకు రూ.1058 కోట్లు
  • అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు

ఇక పథకాలకు వచ్చి.. వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ.4,020 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.2,200 కోట్లు, వైయస్‌ఆర్-పీఎం బీమా యోజనకు రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు,  వైయస్ఆర్ కాపు నేస్తానికి రూ.550 కోట్లు కేటాయించారు. జగనన్న చేదోడు రూ.350 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు కేటాయించారు. అలాగే మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు, జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు, గడపగడపకు 532 కోట్లు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news