ఏపీ రైతులకు శుభవార్త..వ్యవసాయ రంగానికి రూ. 11,387.69 కోట్ల బడ్జెట్

-

అమరావతి : ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ. 11,387.69 కోట్ల బడ్జెట్ న ప్రవేశ పెట్టింది సర్కార్. ఈ మేరకు వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి కురసాల కన్నబాబు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ…మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు ఏర్పాటు చేస్తున్నామని.. మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు కేటాయిస్తునట్లు చెప్పారు.

సహకార శాఖకు రూ.248.45 కోట్లు… ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు… ఉద్యానశాఖకు రూ.554 కోట్లు… పట్టు పరిశ్రమకు రూ. 98.99 కోట్లు పెడుతున్నట్లు ప్రకటన చేశారు. ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు అని.. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.122.50 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.1027.82 కోట్లు ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు, వైఎస్సార్ జలకళకు రూ. 50 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ. 11450.94 కోట్లు ఈ సారి బడ్జెట్ లో పెట్టమన్నారు మంత్రి కన్నబాబు.

Read more RELATED
Recommended to you

Latest news