బ్రేకింగ్: ఏపీ తెలంగాణా సరిహద్దుల్లో మరో అలజడి

ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణాలో కరోనా చికిత్స తీసుకోవాలని భావిస్తున్న రోగులకు ఇప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. తెలంగాణా వెళ్ళే వారిని సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ విషయంలో తెలంగాణా హైకోర్ట్ సీరియస్ గా ఉన్నా సరే తెలంగాణా పోలీసులు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రోగులు అనుమతి ఉంటేనే రావాలని స్పష్టం చేసారు.

తెలంగాణా ప్రభుత్వం కూడా బెడ్ ఖరారు అయితే మాత్రమే రావాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు ఒక కాల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. దీనితో కోదాడ వద్ద తెలంగాణా పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వారిని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో తెలంగాణా హైకోర్ట్ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటీ అనేది చూడాలి.