బర్ద్ ఫ్లూ విషయంలో అనుమానాలు ఉన్నాయా ? ఈ నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోండి !

దాదాపు ఆరు, ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే బర్డ్‌ ఫ్లూ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. బర్డ్‌ ఫ్లూ అంశంలో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని ఆయన అన్నారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు చేశామన్న ఆయన బర్డ్‌ ఫ్లూ వ్యాధిపై సందేహాలుంటే కంట్రోల్‌ రూములకు ఫోన్లు చేసి స్పష్టత తీసుకోవచ్చని అన్నారు. బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ, నివారణ విషయంలో అధికారులకు శిక్షణ ఇచ్చామని మాంసం కోడిగుడ్లు తినడం ద్వారా బర్డ్‌ ఫ్లూ వ్యాపించదని పేర్కొన్నారు. ఇక ఏమైనా అనుమానాలు ఉంటే ఈ నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోండి.

*కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు:*

శ్రీకాకుళం-9989932801, విజయనగరం-9989932825, విశాఖపట్నం-9989932834

*కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు:*

తూ.గో-9966224818, ప.గో-9989932851, కృష్ణ-9989932863

*కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు:*

గుంటూరు-9989932872, ప్రకాశం-9989932879, నెల్లూరు-9989932893

*కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు:*

చిత్తూరు-9989997067, కడప-9441614704, అనంత-9985030053, కర్నూల్-9989997251