తీవ్ర విషాదం : కరెంట్ షాక్ తో నలుగురు మృతి

తెలంగాణలోని మహబాబూబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమనగల్లులో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో రెండు కుటుంబాలకు చెందిన దంపతులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే ముందుగా సత్తయ్య అనే వ్యక్తి స్నానం చేసి బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కి గురయ్యాడు. వెంటనే ఆయన గిల గిల కొట్టుకుంటూ కిందపడి చనిపోయాడు. రక్షించబోయిన భార్య రాధమ్మ కూడా చనిపోయింది.

ఈ క్రమంలో వీరిని పక్కనే ఉండే లింగయ్య-లచ్చమ్మలు రక్షించే క్రమంలో విద్యుత్ షాక్ కి గురై ప్రాణాలు విడిచారు. ఆమనగల్లు లో విద్యుత్ ఘతానికి గురై సత్తయ్య-రాధమ్మ, లింగయ్య-లచ్చమ్మ నలుగురు చనిపోవడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.