ఏపీ బీపీ : గంజాయి నిందితుల్లో అమ్మాయిలా దేవుడా !

-

అన్నింటా మేము ఆకాశంలో మేము అవ‌నిలో మేము అని చెప్పుకునే అమ్మాయిలు సిగ్గుమాలిన ప‌నులు చేస్తుండ‌డంపై ప‌లు విమర్శ‌లు వ‌స్తున్నాయి. చీక‌టి ప‌నుల‌కూ, త‌ప్పుడు ప‌నుల‌కూ వాళ్లే ప్ర‌ధానంగా స‌హ‌క‌రిస్తున్న వైనం పోలీసుల‌ను సైతం హడ‌లెత్తిస్తోంది. అమ్మాయిల‌యితే ఏ అనుమానం రాదు అని అనుకుంటున్నారా లేదా అమ్మాయిలు అయితే అత్యంత చాక‌చ‌క్యంతో వ్య‌వ‌హ‌రించి వివాదాల నుంచి ఒడ్డెక్కిస్తార‌నా? ఏదేమ‌యినా గంజాయి ర‌వాణాలో, డ్ర‌గ్స్ వాడ‌కంలో, ర‌వాణాలో ఇప్పుడు క‌నిపిస్తున్న‌ది అమ్మాయిలే ! పేర్లు వినిపిస్తున్న‌వి అమ్మ‌యిల‌వే ! కోపం కాదు వాస్త‌వం. అంగీక‌రించ‌లేని నిజాలు కొన్ని ఇవాళ దేశం స్థాయిని దిగ‌జారుస్తున్నాయి. సామాజిక భ‌ద్ర‌త కోరుకునే మ‌హిళ‌లు ఇటువంటి చ‌ర్య‌ల‌తో ఏ విధంగా త‌మ‌కు తాము ర‌క్ష‌ణ పొంద‌గ‌ల‌ర‌ని?

తూర్పు గోదావరి ఏజెన్సీ నుంచి / హైదరాబాద్ కి గంజాయి తరలింపు /అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర పట్టుకున్న పోలీసులు/ 470 కేజీలు గంజాయి/ మూడు కార్లు /రెండు లక్షల డబ్బు/ నిందితుల్లో ఇద్దరు యువతులు…

అమ్మాయిలు అన్ని రంగాల‌లో ఉన్నారు. ఉండాలి కూడా ! కానీ ఇటువంటి అనైతిక, అసాంఘిక చ‌ర్య‌ల‌లో మాత్రం ఉండ‌కూడ‌దు. అమ్మాయిలంతా అనుకున్న‌వి సాధించాలి కానీ ఇటువంటివి మాత్రం ద‌క్కించుకోకూడదు. ఇప్ప‌టికే గంజాయి ర‌వాణాకు సంబంధించి ఎన్నో సంద‌ర్భాల్లో ఏపీ ప‌రువు పోయింది. ఇప్పుడు మ‌ళ్లీ ఏపీ ప‌రువు పోగొట్టే ప‌నులు అమ్మాయిలు చేస్తున్నారు.
ప్లీజ్ అమ్మాయిలూ అలా చేయ‌కుండ్రి. అత్యున్న‌త స్థాయిలో అవకాశాలు రావాలంటే పరిశ్ర‌మించండి కానీ ప‌రువు పొగొట్టుకునే ప‌నులు చేయ‌కుండ్రి.

అన్ని రంగాల్లో దూసుకుపోవ‌డం అన్నది అమ్మాయిల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌యిన ప‌ని అని ఇంత‌కాలం ఆనందించేం. కానీ గంజాయి ర‌వాణాలో అమ్మాయిలేంటి అస‌హ్యంగా…! ఇలా అంటే ముంబ‌యి దారుల్లో చీక‌టి అడ్డాల‌లో జ‌రిగే కార్య‌క‌లాపాల్లో కూడా అమ్మాయిలే కీల‌కం అని అంటారేంటో ? ఏ విధంగా వీటిని అర్థం చేసుకోవాలి. దేశాన్ని ముందుకు న‌డిపే శ‌క్తిగా అమ్మాయిలు ఉండాలి కానీ తిరోగ‌మ‌న రూపంలో ఉంటే ఏం చేయాలి.. ఏం చెప్పాలి.. కాస్త‌యినా వివేకానికి ప్రాధాన్యం ఇవ్వాలి క‌దా!

Read more RELATED
Recommended to you

Latest news