అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘మదరసా’పై చేసిన వ్యాఖ్యలపై మండి పడ్డారు పీడీపీ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. ముస్లింలను ఇబ్బందులు పెట్టడంలో సీఎంలు పోటీపడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని యూపీ, గుజరాత్, అస్సాం, ఎంపీ మోడల్ ఇలా దేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. ముస్లింలను రెచ్చగొట్టడం వల్ల యూపీ, గుజరాత్ లో మరో వివాదం చెలరేగేందుకు అవకాశం కల్పిస్తున్నారని.. బ్రిటిష్ వారు హిందువులను, ముస్లింలకు వ్యతిరేఖంగా చూపెట్టారని… ఇప్పుడు బీజేపీ కూడా అదే ప్రయత్నం చేస్తుందని… అంతా చూస్తూ ప్రధాని మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేస్తున్నది సరైనదే అని బీజేపీ పార్టీ భావిస్తుందని విమర్శించారు.
ఇదిలా ఉంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదివారం మదరసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో విద్య గురించి మాట్లాడుతూ…మదరసా అనే పదానికి స్వస్తి పలకాలని అన్నారు. మదరసా ఉన్నంత వరకు పిల్లలు డాక్లర్ కావాలి… ఇంజనీర్ కావాలని ఆలోచించరని ఆయన అన్నారు. విద్యార్థులు మదరసాలో ప్రవేశించాలంటే వారి సొంత నిర్ణయం తీసుకునే వయసు వచ్చిన తర్వాతే మదరసాల్లో చేరాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఏదైనా ఎంపిక చేసుకునే విద్యా వ్యవస్థగా మదరసాలు మారాలి అని ఆయన అన్నారు.