Monkeypox: మంకీపాక్స్ సోకితే క్వారంటైనే…. ఆ దేశంలో అమలు

-

మంకీపాక్స్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వరసగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తుంటే తాజాగా మంకీపాక్ ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే మంకీపాక్స్ సోకితే 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది బెల్జియం దేశం. మంకీపాక్స్ కు క్వారంటైన్ విధించిన తొలి దేశంగా బెల్జియం రికార్డులకు ఎక్కింది. తాజాగా బెల్జియంలో 4 మంకీపాక్స్ కేసులు నమోదు అవడంతో అక్కడి ప్రభుత్వం క్వారంటైన్ నిర్ణయం తీసుకుంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రపంచంలో ఇప్పటి వరకు 12 దేశాల్లో 92 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. మరో 28 కేసులు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం యూకే, పోర్చుగల్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాల్లో మంకీపాక్స్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మే 7న బ్రిటన్ లో నైజీరియా నుంచి వచ్చిన ఒక వ్యక్తిలో మంకీపాక్స్ ను కనుక్కున్నారు. మే 18న యూఎస్ లో మరో కేసు నమోదు అయింది. మంకీపాక్స్ మశూచి కంటే తక్కువ ప్రాణాంతకం.. మరణాల రేటు 4 శాతం కన్నా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news