సొంతిళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త

-

సొంతిళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో ఏకంగా రూ. 4700 కోట్ల నిధులను కేటాయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండరాదని లక్ష్యంతో సీఎం జగన్ “నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు” అనే పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ పథకం కింద తొలిదశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం రూ. 28 వేల కోట్లతో జరుగుతోంది. వీటిలో పది లక్షల ఇళ్లు ప్రస్తుతం పునాది దశలో ఉన్నాయి. మరో మూడు లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్లో… పేద లందరూ ఇల్లు కట్టుకునేందుకు… ఏకంగా నలభై ఏడు వందల కోట్ల నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి బడ్జెట్ లో పెట్టిన ఈ నిధులతో కొత్త లబ్ధిదారులకు… ఇండ్లు కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news