ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… రైతులకు తీపి కబురు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా రైతులకు తీపి కబరు చెప్పింది ఏపీ కేబినెట్. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సెకి తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.

jagan
jagan

రూ. 2.49 కె ఏడాదికి 17 వెల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తేలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమా చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపింది ఏపీ కెబినెట్. 2021 జనాభా గణన లో బీసీ జనాభా ను కులాల వారిగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ లో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది.

అగ్ర వర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. అలాగే అమ్మ ఒడి పథకం అమలు‌, 75 శాతం హాజరు అవగాహన పై కలిపించాలని పేర్కొంది కేబినెట్. విశాఖ మధురవాడ లో శారదా పీఠానికి 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.