ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగునుంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కాబినెట్ హాల్లో సమావేశం కానుంది రాష్ట్ర మంత్రివర్గం. అసెంబ్లీ లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 14 బిల్లులకు అమెదo తెలపనుంది కేబినెట్. ఇప్పటికే 14 ఆర్డినెన్స్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ రోజు కేబినేట్ లో ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ చేయనున్నారు. ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులెటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ, ఏపీ విద్యా చట్ట ఆమోదం కేబినేట్.
అలాగే… ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్సిటిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్సిటిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట రెండో సవరణ, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ బొవైన్ బ్రీడింగ్ చట్ట సవరణ, ఏపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్ చట్ట సవరణ మరియు ఏపీ మున్సిపల్ కార్పోరేషన్ల చట్ట సవరణ ఆమోదం తెలపనుంది. ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణ లకు ఆమోదం తెలపనుంది కేబినెట్….