దేశంలో కరోనా తీవ్రతం క్రమక్రమంగా తగ్గుతోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15 వేల కన్నా తక్కువగా ఉంటోంది. మిగతా యూరోపియన్ దేశాలు, రష్యా దేశాల్లో రోజుకు 40 వేల కన్నా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వీటితో పోలిస్తే భారత దేశ జనాభాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చాలా స్వల్పమనే చెప్పవచ్చు.
దేశంలో గడిచిన 24 గంటల్లో 11,106 కొత్త కరోనా కేసులు నమోదవయ్యాయి. కరోనా బారిన పడి 459 మంది మరణించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,26,620 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో ఇది కేవలం 1 శాతం మాత్రమే. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేరళ రాష్ట్రానివే సగం ఉంటున్నాయి. కేరళలో గత 24 గంటల్లో 6111 కొత్త కరోెనా కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాలు కరోనా కట్టడితో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నాయి.
మొత్తం దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య- 3,44,89,623
రికవరీ సంఖ్య- 3,38,97,921
మరణాలు -4,65,082
టెస్టుల సంఖ్య-62,93,87,540
వ్యాక్సినేషన్- 1,15,23,49,358