ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో రకాల చార్జీలను ఒక్కసారిగా భారీగా పెంచుతూ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ తులసి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. జగన్ సర్కారు ఒక వడ్డింపులు ప్రభుత్వం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఓవైపు మద్యం ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు… ఇసుక సిమెంట్ ఆర్టీసీ చార్జీలు విద్యుత్ ఛార్జీలు పౌరసరఫరాల చార్జీలు ఇలా అన్నీ చార్జీలను పెంచి ప్రజల రక్తం తాగుతుంది అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం ఇచ్చేది గోరంట అయితే ప్రజల వద్ద నుంచి వివిధ ఛార్జీల రూపంలో లాక్కునేది మాత్రం కొండంత ఉంది అంటూ విమర్శించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో బోడి గుండు కొట్టుకున్న పన్ను వసూలు చేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.